శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (09:04 IST)

చిరం'జీవితం' చూస్తుంటే పాత రోజులు గుర్తుకువస్తున్నాయి : వివి వినాయక్

మెగాస్టార్ చిరంజీవి చలనచిత్ర జీవితంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన పుస్తకం 'మెగా చిరంజీవితం 150' సినీ ప్రస్థానం శనివారం విడుదలైంది. జూబ్లీహిల్స్‌లోని కొణిదెల కార్యాలయంలో రామ్‌చరణ్‌

మెగాస్టార్ చిరంజీవి చలనచిత్ర జీవితంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు రచించిన పుస్తకం 'మెగా చిరంజీవితం 150' సినీ ప్రస్థానం శనివారం విడుదలైంది. జూబ్లీహిల్స్‌లోని కొణిదెల కార్యాలయంలో రామ్‌చరణ్‌ పుస్తకాన్ని విడుదల చేసి దర్శకుడు వి.వి.వినాయక్‌కు, అల్లు అరవింద్‌కూ అందించారు. 
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. గతంలో చిరంజీవిపై ఓ పుస్తకాన్ని రాశారు. ఈసారి 150వ సినిమా సందర్భంగా చిరంజీవిపై రాస్తానని పసుపులేటి అన్నారు. ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని అన్నాను. కేవలం 25 రోజుల్లో పుస్తకాన్ని తీర్చిదిద్దారు. ఈ పుస్తకాన్ని 'ఖైదీ నంబర్‌ 150' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లోనే విడుదల చేయాల్సింది కానీ కుదరలేదు. చిరంజీవి నట ప్రస్థానానికి సంబంధించి అన్ని కోణాలను రామారావు ఈ పుస్తకంలో పొందు పరిచి ఉంటారని భావిస్తున్నాను. మా ఫ్యామిలీ తరపున పసుపులేటి రామారావుకి ధన్యవాదాలు అని చెప్పారు. 
 
అనంతరం వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ... ''చిరంజీవిగారంటే పసుపులేటి రామారావుకి ఎంత అభిమానమో, పసుపులేటి రామారావుగారన్నా చిరంజీవికి అంతే అభిమానం. సీనియర్‌ జర్నలిస్ట్‌ రామారావు రాసిన ఈ పుస్తకం బాగుంది. ఈ పుస్తకంలోని కొన్ని ఫోటోలను చూస్తుంటే పాత రోజులు గుర్తుకు రావడమే కాదు, ఆ సినిమాల రిలీజ్‌ సమయంలో చేసిన అల్లరి గుర్తుకు వస్తుంది. ఈ పుస్తకంలో.. మెగా అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే స్వయంకృషి అని రామారావు రాయడం ఎంతో సూపర్‌గా అనిపించింది. చిరంజీవిని రామారావు దగ్గర నుండి చూడటం వల్లనే ఆయన ఈ వాక్యాన్ని రాయగలిగారు. మా అందరి తరపున రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు.
 
నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. ''నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అన్నయ్య 'కోతలరాయుడు' సినిమాకు పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకు రామారావు పి.ఆర్‌.ఒగా పనిచేశారు. అందరి జర్నలిస్టుల కంటే సీనియర్‌గా తనదైన శైలిలో రాణించారు. గౌరవానికే గౌరవమైన చిరంజీవిపై రామారావుగారు పుస్తకం రాయడం ఆనందంగా ఉంది. అందరూ ఇప్పుడు చిరంజీవిని చూసి బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు కానీ, చిరంజీవి ఎప్పటికీ బాస్‌. చిరంజీవిపై వచ్చిన ఈ పుస్తకాన్ని పత్రి అభిమాని చదవాలి'' అన్నారు.
 
హీరో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ... ''పసుపులేటి రామారావు నలబై ఏళ్ళకు పైగా జర్నలిస్ట్‌గా వర్క్‌ చేశారు. ఆయన అనుభవమంతా వయసు లేనివాడిని, ఆయన గురించి నేను ఏం మాట్లాడాలో తెలియలేదు. నేను చిన్నప్పటి నుండి తెలుగులో నెంబర్‌ వన్‌ జర్నలిస్ట్‌గా పసుపులేటి రామారావు పేరు వింటున్నాను. ఈ పుస్తకంలో నేను కూడా చూడని నా ఫోటోస్‌ను రామారావు సేకరించారు. ఈ పుస్తకం మా లైబ్రరీలో నెంబర్‌ వన్‌ బుక్‌ అవుతుంది. నాన్నగారు, మా కుటుంబం, అభిమానుల తరపున పసుపులేటి రామారావుగారికి థాంక్స్‌'' అన్నారు.
 
రచయిత పసుపులేటి రామారావు మాట్లాడుతూ...  మెగా చిరంజీవితం 150 అనే టైటిల్‌ను ఈ పుస్తకానికి పెట్టడానికి ముందు చాలా ఆలోచించాం. చిరంజీవి పుస్తకానికి ఏ పేరు పెట్టాలా అని సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు, చిన్నారాయణతో చర్చించాను.. అయితే చివరకు నేను చిరంజీవిపై ముందు రాసిన మెగా చిరంజీవితం అనే టైటిల్‌ను పెడితే బావుంటుందనిపించి అరవింద్‌కి తెలియజేశాను. ఆయన కూడా నైతికంగా ఎంతో మద్ధతునిచ్చారు. నేను అడగ్గా నా కోసం ఈ పుస్తకం కోసం స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే చిరంజీవి కూడా ఓ స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే దాసరిని అడగ్గానే ఓ స్పెషల్‌ ఆర్టికల్‌ రాసిచ్చారు. నేను విశాలాంధ్రలో పనిచేస్తున్నప్పటి నుండి చిరంజీవితో అనుబంధం ఉంది. మీడియా అంటే చిరంజీవి ముందు నుండి అభిమానం చూపేవారు. అలాగే సినిమాల్లో ఆయన పడ్డ కష్టాన్ని నేను దగ్గర నుండి చూశాను. ఈ రోజు చరణ్‌బాబు చేతుల మీదుగా పుస్తకం రిలీజ్‌ కావడం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు.