గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 మే 2024 (19:56 IST)

బేగా రెడీ అయిపోండి ఒచ్చేత్తన్నారు మనోళ్లు అంటున్న నిహారిక కొణిదెల

Kamity kurrallu
Kamity kurrallu
మెగా డాటర్ నిహారిక కొణిదెల తాజాగా నిర్మిస్తున్న సినిమా "కమిటీ కుర్రోళ్ళు" . అంతా కొత్త వారితో ఉత్తరాంధ్ర యాసతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా తయారవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ పోస్టర్ ను విడుదలచేసి, బేగా రెడీ అయిపోండి ఒచ్చేత్తన్నారు మనోళ్లు అంటూ కాప్షన్ తో అలరించింది.
 
ఉగాది శుభ సందర్భంగా, నిహారిక ప్రతిభావంతులైన కొత్తవారితో "కమిటీ కుర్రోళ్ళు" పేరుతో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ పూర్తిగా మునిగిపోయింది. నిర్మాతలు ఆగష్టు 2024లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఈ చిత్రంపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
 
ఈ ప్రాజెక్ట్‌లో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్యా, తేజస్వీ రావు, విశిక వంటి ప్రతిభావంతులైన తారాగణం ఉన్నారు.