1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జనవరి 2024 (14:20 IST)

విడాకులపై అలా మాట్లాడటం తప్పు... అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా...

Niharika Wedding
విడాకుల అనంతరం తాను ఎదుర్కొన్న విషయాలను మెగా డాటర్ నిహారిక పంచుకుంది. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారి సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్త నిహారక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డకు కూడా చేరింది. 
 
దీంతో నిహారిక చేసిన వ్యాఖ్యలపై చైతన్య స్పందించాడు. వ్యక్తిగతంగా దూషిస్తూ జరుగుతున్న దుష్ప్రచారం తట్టుకోవడం అంతా సులభం కాదని నాకు తెలుసు. ఇలాంటివి చేసేటప్పుడు దానికి కారణమైన వారిని ట్యాగ్‌లు చేయడం నియంత్రించాల్సి ఉంది. ఇలాంటిది జరగడం రెండోసారి. 
 
విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు.. అంటూ చైతూ వెల్లడించాడు. రెండు వైపులా ఆ బాధ, కష్టం ఒకేలా ఉంటుంది. జరిగింది ఏమిటో తెలుసుకోకుండా తీర్పునివ్వడం తప్పని.. ఇలాంటి వేదికల ద్వారా ప్రజలకు ఒక కోణంలోనే చెప్పడం కూడా అంతే తప్పు అని అనుకుంటున్నా. దీన్ని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నానంటూ చైతన్య జొన్నలగడ్డ కామెంట్‌ చేశాడు.