గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (14:48 IST)

పాకిస్తాన్ నటిని పెళ్లాడిన సానియా మీర్జా భర్త, విడాకులు తీసుకున్నాడా?

Shoaib Malik-Sana Javed
Shoaib Malik-Sana Javed
అనుకున్నట్లే జరిగింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త మూడో పెళ్లి చేసుకున్నాడు. విడాకులపై ఇన్నాళ్ల వరకు చక్కర్లు కొట్టిన పుకార్లు నిజమే అయ్యాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే షోయబ్ మాలిక్ మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈసారి పాక్ టీవీ నటిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించాడు. 
 
ఈ పెళ్లితో సానియా ఇప్పటికే షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్నట్లు తేలిపోయింది. కానీ ఇంకా అధికారికంగా ఆమె ప్రకటించలేదు. 2010లో నాటకీయ పరిస్థితుల మధ్య సానియా -షోయబ్ పెళ్లి జరిగింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి షోయబ్ సానియాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సానియా, షోయబ్ కాపురం చాలాకాలం సాగింది. 
Shoaib Malik-Sana Javed
Shoaib Malik-Sana Javed
 
ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా వున్నాడు. దుబాయ్ వేదికగా వీరిద్దరూ పలుసార్లు జంటగా కనిపించారు. ఆపై విడిపోయారు. సనా జావేద్ పాకిస్తానీ నటి. ఉర్దూ టెలివిజన్‌లో ప్రసారమయ్యే పలు సీరియల్స్‌లో నటించారు. ఆమె 2012లో షెహర్-ఎ-జాత్‌తో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు.