గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (08:37 IST)

సానియా మీర్జాతో విడాకులపై తేల్చేసిన షోయబ్ మాలిక్!!

sania mirza - malik
భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా - పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల వివాహ బంధంపై అనేక రకాలైన రూమర్లు వస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని కొందరు, తీసుకోబోతున్నారని మరికొందరు ఇలా అనేక రకాలైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లపై వారిద్దరూ ఎక్కడా నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ, తమ విడాకులపై క్లారిటీ ఇచ్చారు.
 
తామిద్దరం విడిపోయినట్టు వస్తున్న వార్తలపై చెప్పడానికేం లేదన్నారు. రంజాన్ వేళ ఇద్దరం కలిసివుంటే ఎంతో గొప్పగా ఉండేదని, అయితే, ఐపీఎల్‌లో కమిట్‌మెంట్స్ వల్ల సానియా రాలేకపోయారని చెప్పారు. అందుకే తాము కలిసి లేమన్నారు. అయితే, తాము ఎల్లపుడూ ప్రేమను పంచుకుంటూనే ఉంటామని చెప్పుకొచ్చాడు. 
 
ఆమెను తాను చాలా మిస్ అవుతున్నానని, తాను చెప్పాలనుకున్నది ఇదేనని షోయబ్ మాలిక్ అన్నారు. పైగా, ఇలాంటి రూమర్లను తాము అస్సలు పట్టించుకోబోమని అందుకనే తాను కానీ, సానియా మీర్జాగానీ ఎలాంటి ప్రకటన చేయలేదన్నాడు. కాగా, సానియా - షోయబ్ దంపతులకు ఇహాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు.