రెండు గర్వించదగ్గ విషయాలు జరిగాయన్న మహేష్‌బాబు
Saniya merza, mahesh and others
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈరోజు జర్నీ ఎంతో బాగుంది. రెండు గర్వించదగ్గ విషయాలు జరిగాయని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆదివారంనాడు హైదరాబాద్‌లో జరిగిన టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్‌మెంట్ పార్టీకి మహేష్‌బాబు హాజరయ్యారు. అక్కడ సానియాతోనూ వారి కుటుంబంతో దిగిన ఫొటోను పోస్ట్ చేసి వాట్ ఓ గ్రేట్ జర్నీ అంటూ కాప్షప్ పెట్టారు..
అదేవిధంగా ఆ బాష్‌లో ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్‌ను కూడా కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఆయనతో నాని సినిమా చేసిన మహేష్ అప్పటి విషయాలు చర్చించారు. ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో సంబంధించిన ఫిజిక్‌ను డెవలప్‌మెంట్ చేస్తూ ఓ ఫొటో కూడా పెట్టాడు. ఈరోజు రెండు గర్వించదగ్గ విషయాలు జరిగాయని ఇలా తెలియజేశాడు.