శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 మార్చి 2023 (23:58 IST)

పెంపుడు జంతువుల కోసం బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ వద్ద సేవ చేసిన మార్స్‌పెట్‌కేర్‌ సీనియర్‌ లీడర్‌షిప్‌- అసోసియేట్లు

image
పెంపుడు జంతువుల కోసం అత్యుత్తమ ప్రపంచాన్ని సృష్టించాలనే సంస్ధాగత లక్ష్యాలకు కట్టుబడి, పెట్‌కేర్‌ మరియు న్యూట్రిషన్‌లో అగ్రగామి మార్స్‌ పెట్‌కేర్‌ అండ్‌ న్యూట్రిషన్‌, తమ వలెంటీరింగ్‌ కార్యక్రమాన్ని బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (బీసీహెచ్‌) వద్ద నేడు నిర్వహించింది. ఈ అసోసియేట్‌ వలెంటరింగ్‌ కార్యక్రమంలో మార్స్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా లిమిటెడ్‌ వద్ద పెట్‌కేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న సలీల్‌ మూర్తి నేతృత్వంలోని 30 మంది అసోసియేట్లు తమ సమయాన్ని వలెంటీ ర్‌ కార్యక్రమాల కోసం వెచ్చించారు. పెంపుడు జంతువుల పట్ల ఉన్న ప్రేమ, ఆసక్తి,  పెంపుడు జంతువులు కోరుకునే ప్రపంచాన్ని సృష్టించాలనే మార్స్‌ సంస్థ యొక్క లక్ష్యాన్ని సజీవంగా ముందుకు తీసుకువచ్చింది. పెంపుడు జంతువులకు సంతోషకరమైన ప్రపంచం, ప్రతిఒక్కరికీ మెరుగైన ప్రపంచం.
 
మార్స్‌ అసోసియేట్‌ వలెంటీరింగ్‌ ప్రోగ్రామ్‌లో మార్స్‌ పెట్‌కేర్‌ అసోసియేట్‌లు పలు కార్యక్రమాలైనటువంటి పప్పీ బాతింగ్‌, ఆశ్రయం పొందిన శునకాలకు ఫీడింగ్‌, మాప్‌ మేకింగ్‌, టాకింగ్‌ డాగ్స్‌ ఫర్‌ వార్‌, ప్రతి నెలా షెల్టర్‌ యానిమల్స్‌కు ఫీడింగ్‌ చేయడం వంటివి ఉన్నాయి. నేడు, వారు పప్పీ మరియు కిట్టెన్‌ దత్తత కేంద్రాలను బీసీహెచ్‌ వద్ద శుభ్రపరిచారు. పలు కార్యక్రమాలైనటువంటి  పాఠశాలలకు రంగులు వేయడం, పాఠశాల పుస్తకాలు/యూనిఫార్మ్ప్‌ను అందించడం వంటి కార్యక్రమాల ద్వారా సిద్ధిపేటలోని మార్స్‌ పెట్‌ ఫుడ్‌ ఫ్యాక్టరీ చుట్టు పక్కల పాఠశాలల్లో సేవా కార్యక్రమాలను చేశారు.
 
మార్స్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా లిమిటెడ్‌ వద్ద పెట్‌కేర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్‌ మూర్తి  మాట్లాడుతూ ‘‘బ్లూ క్రాస్‌ ఆఫ్‌  హైదరాబాద్‌ వద్ద సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవడమనేది మాకు ఎప్పుడూ సంతోషకరమైన అనుభవాలను అందిస్తుంటుంది. షెల్టర్లలో అద్భుతమైన పెట్స్‌ ఉన్నాయి. వాటికి కావాల్సింది మన ప్రేమ మాత్రమే. పెంపుడు జంతువులు మరియు భారీ పెట్‌ వెల్ఫేర్‌ వ్యవస్ధకు తోడ్పాటునందించడం పట్ల సంతోషంగా ఉన్నాము. బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌తో మాకు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. జంతువులు జీవితాలపై ఎన్నటికీ నిలిచి ఉండేలా ప్రభావం చూపే దిశగా మా ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. వీధి శునకాలకు ఫీడింగ్‌ అందించడంతో పాటుగా దేశీ కుక్కల దత్తత,  కొన్ని షెల్టర్ల వద్ద దత్తత కేంద్రాలను ఆధునీకరించడం, వలెంటరింగ్‌ కార్యక్రమాలు వంటి వాటి ద్వారా మార్స్‌ అసోసియేట్స్‌ తమ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. మేము స్ధిరంగా మా అసోసియేట్లు తమ అభిరుచులను వ్యక్తీకరించడం, ఆలోచనలను వెల్లడించడం ద్వారా సమాజంలో పెంపుడు జంతువుల జీవితాలలో మార్పును తీసుకువస్తున్నాము’’ అని ఆన్నారు
 
మార్స్‌ పెట్‌కేర్‌ , దేశవ్యాప్తంగా 30కు పైగా షెల్టర్లతో భాగస్వామ్యం చేసుకుని, వారికి సామర్ధ్య నిర్మాణం, సదుపాయాల ఆధునీకరణ, ఉచిత/రాయితీ ధరలలో పెట్‌ ఫుడ్‌ అందించడం మరియు దత్తతను ప్రోత్సహించడం చేస్తుంది. పెంపుడు జంతువుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలతో క్రియాశీల భాగస్వామ్యాలు మరియు పెంపుడు జంతువుల ఆహార ఫ్యాక్టరీ ద్వారా సామాజిక-ఆర్ధిక వృద్ది, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాలకు మద్దతు, స్థానిక సమాజానికి ఉపాధి అందించడం, రైతులు నుంచి సేకరించి పాఠశాలలకు మద్దతు అందించడం చేస్తుంది.
 
ఏప్రిల్‌ 2022లో, మార్స్‌ పెట్‌కేర్‌ ఓ దేశీయ శునకాన్ని బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ నుంచి దత్తత తీసుకుంది. మాయ దాని పేరు. ఆరోగ్యవంతంగా ఉండే ఆడ శునకమది. చాలా హుషారుగా ఉన్నప్పటికీ ముందు కాలు మాత్రం వైకల్యం ఉంది. మాయాను  హైదరాబాద్‌లోని మార్స్‌ పెట్‌కేర్‌ కార్యాలయానికి స్వాగతించారు. ఇది బీగెల్‌ జాతికి చెందిన మిలోతో కలిసింది. దానిని ఐదేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. ఇవి అసోసియేట్లందరికీ అసాధారణ శక్తిని ఆఫీసులో అడుగు పెట్టిన వెంటనే అందిస్తుంటాయి. పెడిగ్రీ  అడాప్షన్‌ క్యాంపెయిన్‌ కింద షెల్టర్లతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా మార్స్‌ పెట్‌కేర్‌ దాదాపు  1200 పప్పీలు/డాగ్స్‌ దత్తతకు దేశవ్యాప్తంగా మద్దతు అందించింది. ఈ కార్యక్రమాన్ని  కొనసాగించడం ద్వారా షెల్టర్ల నుంచి మరిన్ని పెంపుడు జంతువులకు స్వాగతించతగిన గృహాలను కనుగొనేందుకు అవకాశం కల్పించడం చేయనున్నాము.
 
అంతర్జాతీయంగా, మార్స్‌ పెట్‌కేర్‌  పెంపుడు జంతువుల కోసం అత్యుత్తమ ప్రపంచాన్ని అందిస్తుంది. దీనిలో భాగంగా పెంపుడు జంతువులకు అనుకూలమైన నగరాలను సృష్టించడం కూడా చేస్తుంది. నగరాలు అభివృద్ధి చెందడటం ద్వారా పెంపుడు జంతువులకు ఉత్తమమైన నగరాల ఆవశ్యకత కూడా పెరుగుతుంది. తద్వారా పెంపుడు జంతువుల యజమానులు, పెంపుడు జంతువులు పెంపుడు జంతువులకు అనుకూలమైన ప్రాంగణాలు, కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, అతి తక్కువగా మనుషులు-జంతువుల మధ్య సమస్యలు రావడం జరుగుతుంది. దీనిలో వీధి కుక్కల సంక్షేమం, ఫోస్టర్‌కేర్‌ బలోపేతం చేయడం, షెల్టర్‌ వాతావరణం మెరుగుపరచడం సాధ్యమవుతుంది. మరింత ప్రగతి శీల విధానాలు అమలులోకి తీసుకురావడం ద్వారా పెంపుడు జంతువులకు అనుకూలమైన వాతావరణాన్ని సంస్థలు సృష్టించవచ్చు. పనిప్రాంగణాల వద్ద పెంపుడు జంతువులు ఉంటే అవి మానసిక స్థైర్యం పెంచుతాయి, కమ్యూనిటీ యొక్క భావాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి మరియు సాధారణ ఆట విరామాల కోసం మనల్ని లేపగలవు. మార్స్‌ పెట్‌కేర్‌ తమ వెబ్‌సైట్‌లో పెంపుడు జంతువుల స్నేహపూర్వక కార్యాలయం కోసం సృష్టించడం ఎలా అనే అంశంపై వివరాలు కంపెనీ వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉంచింది. కంపెనీలు ఉత్తమ అభ్యాసాల కోసం వాటిని వినియోగించవచ్చు.