సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (19:45 IST)

నా కొడుకు పెరిగి పెద్దవాడవుతున్నాడు... చేతిలో చేయి వేసుకొని..? నిహారిక

మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. గత ఏడాది డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ వలన ఇంటికే పరిమితమైన నిహారిక సోషల్ మీడియాలో డిఫరెంట్ పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. 
 
ఆ మధ్య ఆపిల్ ఫ్రై అంటూ కొత్త రకమైన పదార్థాన్ని నిహారిక వండింది. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలానే కొత్త గెటప్‌లోకి మారి ఆ పిక్‌ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది తెగ వైరల్ అయింది. 
 
ఇక తాజాగా తన బర్త్‌డే సందర్భంగా భర్త ఇచ్చిన బజ్ అనే పెట్‌కు సంబంధించిన విషయాన్ని ఒకటి షేర్ చేసింది. మాకు ఏం తోచనప్పుడు చేతిలో చేయి వేసుకొని పడుకొంటామని చెప్పిన నిహారిక నా బేబి బాయ్ పెద్దగా అవుతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇలా తన డాగ్ ఫోటో షేర్ చేయగా.. తన బేబీ బాయ్ పెద్దగా అవుతున్నాడని పోస్ట్ చేసింది. 
 
గతంలో నిహారిక బర్త్ డే సందర్భంగా తన భర్త చైతన్య మొదటి బర్త్ డే గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ గా పెట్ ను ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి దాన్ని తమ సంతానంగా, తన కొడుకుగా నిహారిక భావించుకుంది. అంతే కాకుండా దానికి బజ్ అని పేరు కూడా పెట్టింది. ఇక తనతో బాగా గడుపుతూ దాంతో దిగిన ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది నిహారిక. ఈ నిహారిక పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.