నిహారిక ఒక మనసు ఆడియో: మే 18న చిరు చేతుల మీదుగా రిలీజ్!
నాగబాబు కూతురు నిహారిక త్వరలో హీరోయిన్గా రాబోతోంది. ''మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు'' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మధుర శ్రీధర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియో విడుదల చేసి సినిమా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి డేట్స్ దొరకడంతో ఈ నెల 18 ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు నిహారిక అఫీషియల్ గా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా ఆడియో రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేసింది. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సినిమా ఆడియో రిలీజ్ కానుంది.