సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 15 మే 2018 (19:43 IST)

మ‌హేష్ బాబుతో పోటీ గురించి క్లారిటీ ఇచ్చిన చ‌ర‌ణ్‌..!

మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రాలు క‌లెక్ష‌న్స్ విష‌య‌మై పోటీపడుతున్న విష‌యం తెలిసిందే. రంగ‌స్థ‌లం నెల రోజుల్లో 200 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేస్తే... భ‌ర‌త్ అనే నేను 20 రోజుల్లోనే 205 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రి

మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను, రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రాలు క‌లెక్ష‌న్స్ విష‌య‌మై పోటీపడుతున్న విష‌యం తెలిసిందే. రంగ‌స్థ‌లం నెల రోజుల్లో 200 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేస్తే... భ‌ర‌త్ అనే నేను 20 రోజుల్లోనే 205 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈవిధంగా మ‌హేష్‌, చ‌ర‌ణ్ సినిమాలు పోటీప‌డటం అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. అయితే... ఇదే విష‌యం గురించి రామ్ చ‌ర‌ణ్‌ని అడిగితే... మా మ‌ధ్య పోటీ లేదు. మేం మంచి స్నేహితులం అని చెప్పాడు.
 
ఇంకా ఏం చెప్పాడంటే.... మా మ‌ధ్య పోటీ ఉంద‌ని కొందరు పనిగట్టుకుని చేస్తున్నది అసత్య ప్రచారమని, తనకు మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్ అని, తమిద్దరి మధ్యా ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశాడు. ఎవరి సినిమా కలెక్షన్లు ఎక్కువన్న విషయాన్ని తాము ఎన్నడూ లెక్కించలేదన్నాడు. ఇదంతా  ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తెలియ‌చేసాడు. 
 
తన చిత్రం 'రంగస్థలం', మహేష్ మూవీ 'భరత్ అనే నేను' రెండూ సూపర్ హిట్ కావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. పర్సనల్ హిట్ కొట్టడం కన్నా, ఇండస్ట్రీకి మరో హిట్ లభించిందన్న అంశమే తనకు ముఖ్యమని చెప్పాడు.