శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 1 జులై 2018 (18:04 IST)

పెళ్లి కాలేదని బాధ లేదు.. ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నా: టబు

తెలుగులో, హిందీలో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అగ్రతార టబు. నాలుగు పదుల వయస్సులోనూ మంచి రోల్స్ చేస్తూ వస్తోంది. ఇటీవల విడుదలైన ‘సంజు’ చిత్రంలోనూ టబు కీలక పాత్ర పోషించారు. ''జాగ్రణ్ ఫిలిం ఫెస్టివల్

తెలుగులో, హిందీలో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అగ్రతార టబు. నాలుగు పదుల వయస్సులోనూ మంచి రోల్స్ చేస్తూ వస్తోంది. ఇటీవల విడుదలైన ‘సంజు’ చిత్రంలోనూ టబు కీలక పాత్ర పోషించారు. ''జాగ్రణ్ ఫిలిం ఫెస్టివల్'' సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను టబు వెల్లడించింది. 
 
తనకు పెళ్లి కాలేదని బాధలేదని.. ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపింది. పెళ్లి జీవితం బాగుంటుందా? లేక ఒంటరి జీవితం బాగుంటుందా? అని అడిగితే.. తనకు తెలీదనే చెప్తానని టబు వెల్లడించారు. ఎందుకంటే పెళ్లి జీవితం గురించి తనకు తెలియదని.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌తో కలిసి నటించిన చీనీకమ్ సినిమాలో తాను పోషించిన పాత్ర తన నిజ జీవితానికి దగ్గరగా వుంటుందని టబు తెలిపారు. 
 
అందులో 34 ఏళ్ల యువతి..64 ఏళ్ల వ్యక్తిని ప్రేమిస్తుంది. అయితే ఈ ప్రేమ విషయం తన జీవితంలో జరగలేదు కానీ.. నిజ జీవితానికి దగ్గరగా వుంటుందని టబు క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? అన్న విలేకరుల ప్రశ్నకు టబు ఒకింత ఘాటుగానే బదులిచ్చింది. మీతో వచ్చిన చిక్కు అదేనని, అందుకే మాట్లాడకూడదని అనుకుంటాని అసహనం వ్యక్తం చేశారు.