శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (12:14 IST)

నేను పెళ్లి చేసుకోకుంటే నీకు బాధేంటి : విలేకరిపై టబూ అసహనం

హీరోయిన్లలో ముదురు బ్యాచిలర్‌గా ఉన్న నటి టబూ. ఈమె వయసు 46 యేళ్ళు. అయినప్పటికీ పెళ్లి మాటెత్తడం లేదు. పైగా, ఎవరైనా పెళ్లి మాట ఎత్తితేచాలు వారిపై అంతెత్తున ఎగిరిపడుతోంది. తాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్

హీరోయిన్లలో ముదురు బ్యాచిలర్‌గా ఉన్న నటి టబూ. ఈమె వయసు 46 యేళ్ళు. అయినప్పటికీ పెళ్లి మాటెత్తడం లేదు. పైగా, ఎవరైనా పెళ్లి మాట ఎత్తితేచాలు వారిపై అంతెత్తున ఎగిరిపడుతోంది. తాజా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రశ్న అడిగిన విలేకరిపై కూడా టబూ చిందులేసింది.
 
తాను ఒంటరిగానే ఉంటున్నానని, పెళ్లి చేసుకోనందుకు ఏ మాత్రమూ బాధపడటం ఈ ముదురు హీరోయిన్ చెప్పుకొచ్చింది. తానిప్పుడు ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడుపుతున్నానని, తానింకా వైవాహిక జీవితం గడపలేదు కాబట్టి, పెళ్లయితే బాగుంటుందా? కాకుంటేనే బాగుంటుందా? అన్న విషయాన్ని చెప్పలేనని తెలిపింది.
 
అయితే, భవిష్యత్తులోనైనా పెళ్లి చేసుకుంటారా? అని మరో విలేకరి ప్రశ్నించగా, మరింత ఘాటుగా సమాధానం చెప్తూ, మీతో వచ్చిన చిక్కే ఇదని, అందుకే మీడియాతో తాను మాట్లాడనని అసహనాన్ని వ్యక్తంచేసింది.