శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (12:32 IST)

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

NTR, Director Prashanth Neel Dragon
NTR, Director Prashanth Neel Dragon
ఎన్టీఆర్‌,  దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చిత్రం హైదరాబాద్ షెడ్యుల్ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్‌ 31వ సినిమాగా మైత్రీ మూవీస్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు..గత ఎడాది ఆగస్ట్ లో రామానాయుడు స్టుడియోలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కాగా, ఈ సినిమా షూట్‌ మొదలు కానుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దానిపై గత నెలలోనే  ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖిత అప్‌డేట్‌ ఇచ్చారు. బెంగుళూరులో కుటుంబంతో సహా ఎన్టీఆర్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.
 
తాజా సమాచారం మేరకు, బుధవారం నాడు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటి లో యాక్షన్ సీన్స్ తో ఎన్టీఆర్‌,  దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం ఆరంభం అయింది. ఫైట్ మాస్టర్స్ అన్బుమణి, అరివుమణి సమక్షంలో యాక్షన్ సీన్స్ మెదలైంది. పోలీస్ లు, రౌడీలు, కొంత మంది జునియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనారు. తమిళ్లో అన్బుమణి, అరివుమణి పెద్ద సినిమాలకు యాక్షన్ కోరియోగ్రఫీ చేసారు. కమల్ హసన్ కూడా వీరిని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైయెస్ట్ పారితోషికం తీసుకుంటారని పేరు ఉంది. పాన్ వరల్డ్ సినిమాగా సరికొత్తసీన్స్ చేయనున్నారట. 
 
కేజీయఫ్‌ 1, 2కి మించిన విధంగా యాక్షన్ ప్లాన్ చేసారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించిన డ్రాగన్ సినిమాలో రుక్మిణీ వసంత్‌ నాయికగా నటిస్తోంది. సౌత్ కు చెందిన పలువురు ప్రముకులు ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్యరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.