బేబి కోసం ముందుగానే ఏర్పాట్లు: అనిత
నువ్వునేను సినిమాతో తెలుగులో పరిచయమైన నాయిక అనిత హసానందాని. ముంబైకు చెందిన అనిత తెలుగు, హిందీ, తమిళ సినిమాలు చేస్తున్నప్పుడే రోహిత్‌ఱెడ్డిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సీరియల్‌లలో నటించింది. కరోనా సమయంలోనే 2020 అక్టోబర్‌లో తాను గర్భం దాల్చినట్లు ఇన్‌స్‌ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. తాజాగా ఈరోజు తాను బేబీ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలియజేసింది. తన భర్తతో ఫోను కూడా షేర్ చేసింది.
అంతేకాకుండా ఆసుప్రతికి సంబంధిత సామానులు తీసుకువెళుతున్నట్లు.. బేబీకోసం చిన్న కవితలా మాటల్లో చెప్పింది. అతిత్వరలో నేను బేబీకి జన్మ ఇవ్వబోతున్నాను. అందుకే నాచురల్, కాటన్ దుస్తలు, చెప్పులు, నా ఫోన్, ఛార్జర్, మాచ్యురైజ్‌తోపాటు బేబీకి ఉపయోగించే సున్నితమైన కాటన్ దుస్తులు, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకెళుతున్నానని వాటిని చూపిస్తూ... బేబీ పాంపరిన్ సూట్‌కేస్... అంటూ దానికి పేరు పెట్టి ఆనందాన్ని వ్యక్తం చేసింది.
అనితా హసానందాని తన మొదటి బిడ్డను ఎప్పుడైనా ప్రసవించే వీలుంది. ఆ క్రమంలోనే ఎమోషనల్ అవుతోంది. ``చివరి త్రైమాసికంలో ఉన్నాను కాబట్టి గడువు తేదీ త్వరలో ఉంది`` అని అనిత చెప్పింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.. చాలా మిశ్రమ భావోద్వేగాలను కలిగి ఉన్నాను.. కానీ నిజంగా ఉద్వేగంగా ఉన్నాను .. నా జీవితంలో కొత్త దశ కోసం ఎదురు చూస్తున్నాను. శిశువు ఆగమనం వరకూ వేచి ఉండలేను`` అంటూ ఎమోషన్ అయ్యింది.