నాని సినిమా ప్రమోషన్‌కూ అడ్డంకులు ఎదురవుతున్నాయ్!
నాని కథానాయకుడిగా నటించిన కుటుంబ కథా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాలో టక్ చేసుకోవడంపైనే కథ మొదలవుతుంది. యాక్షన్ సీన్‌లోకూడా టక్ ఊడకుండా చితకొడతాడు. ఇలా టక్ చేసుకోవడం ప్రతి మనిషిలో కలుగుతుంది. నేను బాగున్నానా! లేదా! అన్నట్లుగా ఫీల్ కలుగుతుంది. కొత్తగా టక్ చేసుకోనివాడికి కొత్తగా అనిపించేట్లుగా తనకూ అనిపించిందని నాని చెప్పాడు. అయితే కరోనా వల్ల సినిమా విడుదల వాయిదావేశారు. కానీ ఎట్టిపరిస్తితుల్లోనూ థియేటర్‌లో విడుదల చేస్తానని ప్రకటించాడు నాని. కానీ నాని రూట్ మార్చాడు. తన మాటలు వెనక్కుతీసుకుంటున్నట్లు వెల్లడించాడు. అందుకే సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానుంది
అయితే ఈ సినిమా విడుదలలో ఎటువంటి అడ్డంకలు వచ్చాయో ఇప్పుడు అమెజాన్ సంస్థ ఓ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గత వారంరోజులుగా ప్రయత్నాలు చేస్తూనే వుంది. కానీ ఎక్కడా సరైన వేదిక దొరక్కపోవడం విశేషం. ముందుగా ఫిలింసిటీలో గ్రాండ్ గా మరోసారి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. అందుకు ఆహ్వనాలుకూడా అందరికీ వెళ్ళాయి. కానీ తర్వాత రోజు వారికి ఫిలింసిటీలో శ్లాట్ దొరకలేదని మెసేజ్ వచ్చింది. దాంతో హైదరాబాద్ సిటీలో పలు స్టార్ హోటల్లలో నిర్వహించడానికి ప్రయత్నించారు. కానీ ఏ హోటల్ ఖాళీగా లేవని తెలిసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సెప్టెంబర్ 1న సెంటిమెంట్‌గా అమెజాన్ కార్యక్రమం చేయాలని తలపెట్టింది. కానీ ఆరోజు ఎక్కువగా శుభకార్యాలు జరగడం వల్ల ఖాళీలేకపోవడం విశేషం. దాంతో ఓ రెండు గంటలపాటు మాదాపూర్‌లోని ఓ హోటల్ లో ఖాలీ దొరకడంతో ఆ టైంలో పెట్టాలని డిసైడ్ అయ్యారు. సో.. కరోనా ముందు కరోనా తర్వాత కూడా టక్‌జగదీష్‌కు అడ్డంకులే. మరి అమెజాన్‌లో విడుదలయ్యాక ఏమేరకు ఆదరణ వుంటుందో చూడాలి.