గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (05:55 IST)

బాహుబలి2 రన్ టైమ్ ఇంతనా... మూడుగంటల నిడివి సినిమాను చూసేదెవరు?

బాహుబలి2 సినిమా రన్ టైమ్‌పై గత కొద్ది రోజులుగా నడుస్తున్న చర్చలకు తాళం పడింది. రెండోభాగం నిడివి రెండు గంటల 50 నిమిషాల వరకు ఉంటుందని వస్తున్న వార్తలను సెన్సార్ సర్టిఫికేట్ నిర్ధారించింది. దీని ప్రకారం సినిమా డ్యూరేషన్ సరిగ్గా రెండు గంటల 50 నిమిషాల 51

బాహుబలి2 సినిమా రన్ టైమ్‌పై గత కొద్ది రోజులుగా నడుస్తున్న చర్చలకు తాళం పడింది. రెండోభాగం నిడివి రెండు గంటల 50 నిమిషాల వరకు ఉంటుందని వస్తున్న వార్తలను సెన్సార్ సర్టిఫికేట్ నిర్ధారించింది. దీని ప్రకారం సినిమా డ్యూరేషన్ సరిగ్గా రెండు గంటల 50 నిమిషాల 51 సెకన్లు. దక్షిణాది భాషల్లో ఈ నిడివి ఉన్నప్పటికీ హిందీ వెర్షన్‌లో మాత్రం నిడివిని బాగా తగ్గించారని కొత్తగా వార్తలు వినిపిస్తున్నాయి.
 
రెండోభాగం నిడివి ఎక్కువ ఉంటుందనే విషయాన్ని రాజమౌళి అంగీకరించినప్పటికీ ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే దానికి ఓ కారణం ఉంది. సెన్సార్ రిపోర్ట్ బయటకు వస్తే.. సినిమా ఎలా ఉంటుందనే విషయం కూడా బయటకు వస్తుంది. ఆ కారణంగానే బయటకు రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సినిమా రన్ టైమ్‌ను కూడా గోప్యంగా ఉంచారు. అయితే సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ బయటకు రావడంతో సినిమా నిడివి ఎంతనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. 
 
అయినా ఇంత రన్ టైమ్ అనే విషయం ముందే బయటకు వచ్చి ఉంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందంటూ నెగెటివ్ ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. అందుకే రాజమౌళి ఈ అంశాన్ని బయటకు రానివ్వలేదు. అయితే నిడివి ఎక్కువ ఉన్నా సరే ఆడియన్స్‌కు మాత్రం బోర్ కొట్టకుండా సినిమాను తీర్చిదిద్దామని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించారు. 
 
తెలుగు సినిమాను ఇంత గ్రాండియర్‌గా, అంతర్జాతీయ స్థాయిలో తీసినందుకు గర్వంగా ఉందంటూ సెన్సార్ సభ్యులే పొగిడారని కూడా వార్తలు వచ్చాయి. ఇది నిజమైనా కాకపోయినా విడుదల తేదీ వరకు సినిమాపై సస్పెన్స్ ను కొనసాగించడలో అటు నిర్మాతలు, ఇటు దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.