ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 14 మే 2016 (12:02 IST)

నర్గీస్ ఫక్రీ కోపంతో ఫ్లైట్ ఎక్కేసిందట కారణం ఉదయ్ చోప్రానా?

బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కోపంతో ఫ్లైట్ ఎక్కేసిందట. నర్గీస్ ఫ్లైట్ ఎక్కేందుకు కారణం ఉదయ్ చోప్రా అని తెలిసింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని వార్తలొచ్చాయి. ముందుగా పెళ్లి చేసుకుంటానని ఉదయ్ చోప్రా నర్గీస్‌ను అడిగినప్పుడు కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని వద్దన్న ఫక్రీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో ఉదయ్ చోప్రాను పెళ్లాడేందుకు ఓకే చెప్పేసింది. అయితే ఉదయ్ చోప్రా ప్రస్తుతం రివర్స్ అయ్యాడు. నర్గీస్ ఫక్రీతో పెళ్ళొద్దని ప్రియుడు నిరాకరించాడు. 
 
దీంతో ఉదయ్ చోప్రా మీద అలిగిన నర్గీస్ ఫక్రీ న్యూయర్క్ ఫ్లైట్ ఎక్కేసి జంప్ అయింది. దీంతో అజార్, హౌస్ ఫుల్ 3 ప్రచార కార్యక్రమాలతో పాటు.. బాంజో షూటింగ్ ఇబ్బందుల్లో పడ్డాయి. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్లి పోయిన ఆ భామని.. నిర్మాతలు ఎలా రప్పించాలా? అని తలపట్టుకుని కూర్చున్నారట. ఇప్పటికే అజర్ విడుదలై నెగటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.