ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 జనవరి 2017 (10:25 IST)

'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో విషాదం... వడోదర స్టేషన్‌లో తొక్కిసలాట

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేం

బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నటించిన 'రాయీస్' చిత్ర ప్రమోషన్ విషాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరు దుర్మణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. తమ హీరోను చూసేందుకు వచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ విషాదం జరిగింది. 
 
'రాయీస్' చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ముంబై నుంచి రైల్లో ఢిల్లీ వెళుతున్న షారూక్‌ వడోదర స్టేషన్‌లో ఆగారు. అక్కడ రైలు 10 నిముషాలు ఆగింది. దీంతో తమ అభిమాన హీరో (షారూక్)ను చూసేందుకు ఒక్కసారిగా వేల మంది జనం స్టేషన్ వద్దకు వచ్చారు.
 
తలుపు వద్ద నిలుచున్న షారూక్‌ను చూసేందుకు ఎగబడ్డారు. అప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి వచ్చింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. కొందరు ఊపిరి అడక ఇబ్బంది పడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పుడే ఓ వ్యక్తి చనిపోయాడు. రైల్వే పోలీసుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.