సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (12:39 IST)

కాలుజారిన చెప్పును తొడగబోయిన పోలీస్‌.. చెంప చెల్లుమనిపించిన శ్రీకాంత్? (వీడియో)

సినీ హీరో, క్యారక్టర్ ఆర్టిస్టు శ్రీకాంత్ తాజాగా ''ఆపరేషన్ 2019'' సినిమాతో ముందుకు రానున్నాడు, ఈ సినిమాకు బివేర్ ఆఫ్ పబ్లిక్ అనేది ట్యాగ్ లైన్. 'ఆపరేషన్ దుర్యోధన' మాదిరిగానే ఈ సినిమా కూడా పోలిటికల్ డ్

సినీ హీరో, క్యారక్టర్ ఆర్టిస్టు శ్రీకాంత్ తాజాగా ''ఆపరేషన్ 2019'' సినిమాతో ముందుకు రానున్నాడు, ఈ సినిమాకు బివేర్ ఆఫ్ పబ్లిక్ అనేది ట్యాగ్ లైన్. 'ఆపరేషన్ దుర్యోధన' మాదిరిగానే ఈ సినిమా కూడా పోలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతుంది. తాజాగా ఆపరేషన్ 2019 సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజకీయ వ్యూహాలకి సంబంధించిన సన్నివేశాలు ఈ ట్రైలర్లో అదుర్స్ అనిపిస్తున్నాయి.
 
తన కాలు నుంచి జారిన చెప్పును ఓ పోలీస్ ఆఫీసర్ తొడగబోగా ఆయన చెంపను శ్రీకాంత్ పగలగొట్టడం ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. "గాంధీ కడుపున గాంధీ పుట్టడు.. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు.. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకు రావలసిందే" అంటూ శ్రీకాంత్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. 
 
ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని టాక్ వస్తోంది. బెల్టుకు రివాల్వర్‌తో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్లిన పోలీస్ అధికారి మనోజేనోమో అనే అనుమానం ఈ ట్రైలర్‌ను చూస్తే కలుగుతోంది. ఈ సినిమాలో ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి..