ఆ సంగీతం అంటే భక్తి.. ఈ సంగీతం భుక్తి..'; యేసుదాస్‌కు పద్మవిభూషణ్
కె.జె. ఏసుదాస్ ఒకప్పుడు పద్మభూషణ్.. నేడు పద్మవిభూషణ్. 'దేహం ఘటం' అన్నారు పెద్దలు. స్వర సప్తకాలు గాయక శిఖామణి యేసుదాస్‌లో కెరటాలుగా పొంగి స్వర రాగంగా ప్రవాహాన్ని నిత్యం సృష్టిస్తూంటాయని చెప్పవచ్చు. తన తండ్రి అగస్టీన్ జోసెఫ్ భాగవతార్ నుంచి సంక్రమి
కె.జె. ఏసుదాస్ ఒకప్పుడు పద్మభూషణ్.. నేడు పద్మవిభూషణ్. 'దేహం ఘటం' అన్నారు పెద్దలు. స్వర సప్తకాలు గాయక శిఖామణి యేసుదాస్‌లో కెరటాలుగా పొంగి స్వర రాగంగా ప్రవాహాన్ని నిత్యం సృష్టిస్తూంటాయని చెప్పవచ్చు. తన తండ్రి అగస్టీన్ జోసెఫ్ భాగవతార్ నుంచి సంక్రమించిన స్వరాస్తిని ఎన్నో రెట్లు అధికం చేసి కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు తనదైన గాన సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారాయన. 'కృష్ణాకృపా సాగరం'లో తడిసిపోతూ గురువాయూరప్ప భక్తునిగా యేసుదాస్ పంచిన గానామృతం ఒకప్పుడు ఆయనకు కాదు పొమ్మన్నవారికే అత్యంత ప్రీతిపాత్రమయ్యేలా చేసింది.
ఓ వైపు కర్నాటక సంగీతంలో కచేరీలు చేస్తూనే.. మరోవైపు సినిమా సంగీతంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారాయన. ఈ రెంటిలో ఏదీ మిన్న అంటే.. కర్నాటక సంగీతం అంటే భక్తి.. సినిమా సంగీతం నాకు భుక్తి..' అని చెబుతారాయన. ఆయన జన్మస్థలమైన కేరళలోనే కాకుండా యావద్భారతంలో యేసుదాస్‌కు ఎనలేని గౌరవసత్కారాలు లభించాయి. కొందరు 'సంగీతరాజా' అని గౌరవిస్తే మరికొందరు 'సంగీత సాగరం' అని అభిమానించారు. ఇంకొందరు 'సంగీత చక్రవర్తి'గా పట్టాభిషేకం చేశారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో గౌరవించింది. 'ఎంత ఎదిగామన్నది ముఖ్యం కాదు. మనిషిగా ఎంతగా పరిణతి చెందాం అన్నదే ముఖ్యం' అని విశ్వసించే యేసుదాస్ 30 వేలకు పైగా సినిమా పాటలు ఆలపించారు. తన కచేరీలలో కర్నాటక సంగీతామృతాన్నీ పంచుతున్నారు.