సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (15:06 IST)

చెరుకు గడ ఎలా తినాలో తండ్రి వద్ద నేర్చుకున్న పరిణీతి చోప్రా

బాలీవుడ్ హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. ఈమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది. చెరుకు గడ ఎలా తినాలో తండ్రి పవన్ చోప్రా నేర్పిస్తున్న వీడియోను షేర్ చేసింది. అయితే, ఈ పరీక్షలో ఫెయిల్ అయినట్టు చెప్పింది.
 
నాన్న నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్న ప్రతీసారి నెర్వస్‌గా ఫీల్ అవుతానని.. ఎందుకంటే నాన్న ప్రతీ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారని చెప్పింది. ఈ వీడియోపై అభిమానులు క్యూట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తూనే.. ‘ప్రాక్టీస్ మేక్స్ పరిణీతి పర్‌ఫెక్ట్’ అని సలహాలు ఇస్తున్నారు. 
 
రోజూ షుగర్ కేన్ తినడం ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. మరికొందరేమో మా ఏరియాలో అయితే చిన్న పిల్లలు కూడా చక్కగా చెరుకు గడ తినేస్తారని.. తను మాత్రం ఓవరాక్షన్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పరిణీతి ప్రస్తుతం హర్యానాలోని అంబాలలో వ్యవసాయ జీవితాన్ని ఆస్వాదిస్తోంది.