శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (20:01 IST)

ఒకవైపు ముక్కుదిబ్బడ, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి, ఏంటది, ఏం చేయాలి?

శీతాకాలం రాగానే చాలామందికి ఎదురయ్యే సమస్య జలుబు, ముక్కుదిబ్బడ. సాధారణమైన జలుబు అయితే ఏదో నాలుగైదు రోజులు వుండి పోతుంది. కానీ ముక్కుదిబ్బడ వేసి ఊపిరాడకుండా చేసే పరిస్థితి వచ్చిందంటే అది సైనసైటిస్ కావచ్చు. చాలామందికి జలుబు చేస్తుంటుంది. వారం రోజుల్లోపు తగ్గిపోతుంది. కానీ జలుబు వల్ల ముక్కు దిబ్బడ వేసి, ముక్కు లోపల తయారైన ద్రవాలు బయటికి రాక ఇబ్బంది పడటం వంటిది వున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.
 
ఎందుకంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది బాక్టీరియల్ సైనసైటిస్ అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదు. అందువల్ల జలుబు రాగానే మిరియాల పాలు తాగడం, ఆవిరి పట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముక్కు దిబ్బడగా వుంటే వైద్యులు సూచించిన ముక్కులో వేసుకుని చుక్కల మందు వాడొచ్చు.
 
సైనసైటిస్ అనగానే చాలామంది భయపడుతుంటారు. కానీ ఇపుడు దాన్ని నయం చేసే చికిత్సలు వచ్చాయి. కొన్ని తొలిదశలోనే మందులకు నయం అవుతాయి. అలా కాని పక్షంలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. అదికూడా చాలా అరుదుగానే వైద్యులు సూచన చేస్తారు.