పవన్‌తో ఉన్న బంధం తెగిపోవచ్చు.. కానీ, స్వేచ్ఛను ఎందుకు వదులుకోవాలి : రేణూ దేశాయ్
తనకు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌తో ఉన్న వైవాహిక బంధం తెగిపోవచ్చు. కానీ, తన స్వేచ్ఛను మాత్రం ఎందుకు వదులుకోవాలి అంటూ సినీ నటి రేణూ దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఫోటోలను ట్వీట్ చ
తనకు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌తో ఉన్న వైవాహిక బంధం తెగిపోవచ్చు. కానీ, తన స్వేచ్ఛను మాత్రం ఎందుకు వదులుకోవాలి అంటూ సినీ నటి రేణూ దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఫోటోలను ట్వీట్ చేసినప్పుడల్లా రేణుకు కొందరు అభిమానుల నుంచి.. అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆమె స్పందించారు.
పవన్‌కు 11 యేళ్లపాటు భార్యగా ఉన్నాను. పెళ్లికాక ముందు ఆరేడేళ్లు కలిసున్నాం. ఆయనతో కలిసి రెండు సినిమాల్లో నటించా. మాకు ఇద్దరు పిల్లలు. మేము స్నేహపూరితంగానే దూరమయ్యామేగానీ ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలు లేవు. ఆయనను ఓ ఫ్రెండ్‌గా భావిస్తాను. అలాంటప్పుడు ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడకూడదు? అని ప్రశ్నించారు.
అంతేనా... ట్విట్టర్‌లో పోస్టు చేస్తే మా ఇద్దరికంటే మిగిలిన ప్రపంచానికి ఎందుకు సరిపోవడం లేదో నాకు అర్థం కావడం లేదు. అది వాళ్ల సమస్య. దానికి నేను బాధ్యురాలిని కాదు. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ట్వీట్ చేయడం నాకున్న స్వేచ్ఛ. 'వపన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని నీకు పబ్లిసిటీ కావాలి?' అంటూ కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తున్నారు.
చేతిలో స్మార్ట్‌ఫోన్, దానికొక వైఫై ఉంటే చాలు. టకటకా ఏదో నాలుగు అక్షరాలు ఆవేశంగా టైప్ చేసి పోస్టు చేస్తే సరిపోదు. కొంచెం ఆలోచించాలి. వారి వారి వ్యక్తిగత ఫ్రస్ట్రేషన్లన్నీ నా మీద వెల్లగక్కడం భావ్యం కాదు. కొంతమంది అంటారు 'నువ్వు సోషల్ నెట్‌వర్కింగ్ మానేయొచ్చు కదా'ని! నేనెందుకు మానేయాలి. పవన్ అందరికీ హీరో. నాకు నచ్చిన ఆయన ఫిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడం తప్పు కాదు. అర్థం చేసుకోండి.. అంటూ ఘాటుగానే సమాధానమిచ్చింది.