బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (12:05 IST)

సినిమాలకు పవన్ కళ్యాణ్ గుడ్‌బై.. ఫిల్మ్ నగర్‌లో పుకార్లు

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే తన సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పుకార్లు షికారు చేస్తున్నాయి.

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే తన సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పుకార్లు షికారు చేస్తున్నాయి. 
 
'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ చేయనున్న తదుపరి చిత్రంపై ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. అదేసమయంలో ఆయన ప్రజా సమస్యల అధ్యయనం కోసం జనంలోకి వెళుతున్నారు. ఇందుకోసం ప్రజా యాత్రలను గత సోమవారం నుంచి ప్రారంభించారు. తద్వారా తన పార్టీ జనసేనను మరింత బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. 
 
ఇందుకోసం వచ్చే 2019 ఎన్నికల వరకు ఆయన సినిమాలకు దూరంగా ఉంటారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టలేనని, పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. పవన్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఏది ముందు పట్టాలెక్కుతుందో తెలియడం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
 
2019 ఎన్నికల తర్వాత ఆయన రెండేళ్లకు ఓ సినిమా చేస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ, అది నిజమో కాదో తెలియడం లేదు. పూర్తిగా రాజకీయాల్లోకి దిగాలన్న ఆలోచనతోనే పవన్ నిర్మాతలు తనకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేశారని టాలీవుడ్ వర్గాల కథనం మేరకు తెలుస్తోంది.