ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (12:03 IST)

పవన్ కళ్యాణ్ పసివాడు.. పాపం : రేణుకా చౌదరి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా చౌదరి సానుభూతి వ్యక్తంచేశారు. "పవన్.. పాపం పసివాడు" అంటూ వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా చౌదరి సానుభూతి వ్యక్తంచేశారు. "పవన్.. పాపం పసివాడు" అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. 
 
'రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!' అంటూ వ్యాఖ్యానించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థేనని అన్నారు. అదేసమయంలో సీఎం రేసులో తాను లేనని, ఆ ఆశ కూడా తనకు లేదని ఆమె స్పష్టంచేశారు. 
 
ఇకపోతే, 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తానని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామంటూ ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు.