శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (10:35 IST)

పవన్‌కు నాపై లవ్వెక్కువ : కాంగ్రెస్ నేత వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీహెచ్ పేరును ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీహెచ్ పేరును ప్రకటిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తానంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు స్పందించారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, 'మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాను. అంచెలంచెలుగా పైకి వచ్చానని పవన్ వ్యాఖ్యల అర్థం అయి ఉండొచ్చు. నేను సీఎం కావాలనుకోవడం పవన్ అభిమానం. అయితే, కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని అధిష్ఠానం నిర్ణయిస్తుంది. పవన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి ఎవరో ఒకరు తీసుకెళతారన్నారు. 
 
ఇకపోతే, నేను పవన్‌తో పాటు వెళ్లడం కాదు.. పవన్ నాతో కలిసి వస్తానంటే కనుక పల్లెల్లో రైతుల కష్టాలు, ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తా. పవన్ కల్యాణ్‌లో ఇంకా మార్పు రావాలి. పవన్ నాపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కాదు, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను గుర్తించాలి. పవన్‌పై నేను చేసే విమర్శలు ఆయన చేసే కామెంట్ మేరకు ఉంటాయి' అని మీడియాతో వీహెచ్ అన్నారు.