శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (15:02 IST)

ఇంకెక్కడ కూడా ఇంత సంతోషంగా ఉండలేడు : హైపర్ ఆది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ తన రాజకీయ ప్రజా యాత్రను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ తన రాజకీయ ప్రజా యాత్రను తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆయన ఆకట్టుకునే ఉపన్యాసాలతో తనదైన స్టైల్లో దూసుకెళుతున్నారు. 
 
ఈ యాత్రపై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ట్వీట్ చేశాడు. "కల్యాణ్ అన్నయ్య జనంలో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాడు. ఇంకెక్కడా సంతోషంగా ఉండలేడు. జనంలో ఉంటా జనంలా ఉంటా.." అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో పాటు పవన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలకు సంబంధించిన రెండు ఫోటోలను పోస్ట్ చేశాడు హైపర్ ఆది.