బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (15:52 IST)

అమెరికాకు పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హఠాత్తుగా అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కొంతమంది ప్రముఖులను కలవాల్సి ఉండగా.. దానికోసం పవన్ హుటాహుటిన అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల వరకు పవన్ అమెరికాలోనే ఉండనున్నట్లు సమాచారం.
 
ఇక ఆ పని పూర్తి అయిన తరువాత సెట్‌లో అడుగుపెట్టనున్నారట. బస్సు యాత్ర డేట్ కన్ఫర్మ్ అయ్యేవరకు ఆయన సినిమాలతోనే బిజీగా ఉండనున్నారట. 
 
ఇకపోతే ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు చివరి దశలో ఉండగా.. భవదీయుడు భగత్ సింగ్,వినోదాయ సీతాం సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. 
 
ఇక ఏవి కాకుండా లైన్లో సురేందర్ రెడ్డి సినిమా ఉంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకే పవన్ వారికి టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకదాని తరువాత ఒకటి గ్యాప్ లేకుండా పవన్ షూటింగ్స్‌లో పాల్గొననున్నాడట.