పవన్‌తో మోహన్‌లాల్... కాటమరాయుడు చిత్రం తర్వాత...
జనతా గ్యారేజ్, మనమంతా చిత్రాలతో తెలుగువారికి బాగా దగ్గరైన మోహన్ లాల్ 'మన్యం పులి'తో మరింత పేరు తెచ్చుకున్నారు. అందుకే మరోసారి తెలుగులో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే చిత్రానికి ఆయన్ను ప్రమ
జనతా గ్యారేజ్, మనమంతా చిత్రాలతో తెలుగువారికి బాగా దగ్గరైన మోహన్ లాల్ 'మన్యం పులి'తో మరింత పేరు తెచ్చుకున్నారు. అందుకే మరోసారి తెలుగులో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోయే చిత్రానికి ఆయన్ను ప్రముఖ పాత్రకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే ముందుగా ఉపేంద్ర పేరు పరిశీలనలో వున్నా.. మార్కెట్‌పరంగా మోహన్‌లాల్ పనికివస్తాడని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇప్పటికే ఆయన్ను సంప్రదించడం.. మోహన్ లాల్ అంగీకరించాడని తెలుస్తోంది. 'మన్యంపులి' చిత్రంతో మరింత దగ్గరైన మోహనల్ అన్నివిధాలా సరైన వ్యక్తని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా, నాయికలుగా కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ పేర్లు వినిపిస్తున్నాయి. 'కాటమరాయుడు' తర్వాత ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళనుంది.