శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 8 మే 2017 (01:23 IST)

బాహుబలి-2కి పవన్ కల్యాణ్ నీరాజనం.. రాజమౌళి, ప్రభాస్, టీమ్ మొత్తానికి అభినందనలు

విడుదలైన పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన బాహుబలి-2 సినిమాపై ఎట్టకేలకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆదివారం రాత్రి పవర్ స్టార్ వరస ట్వీట్లతో బాహుబలి-2 సి

విడుదలైన పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన బాహుబలి-2 సినిమాపై ఎట్టకేలకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆదివారం రాత్రి పవర్ స్టార్ వరస ట్వీట్లతో బాహుబలి-2 సినిమాకు, దర్సకుడు రాజమౌళికి, ప్రభాస్ సహా టీమ్ మొత్తానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళిని, ప్రభాస్‌ని శ్రీ అని పవన్ సంబోధించడం విశేషం. 
 
రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్‌ సహా బాహుబలి టీమ్‌ అందరికీ పవన్‌ అభినందనలు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన రాజమౌళి మనందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు..’ అన్న పవన్‌ కల్యాణ్‌.. భవిష్యత్తులో ఆయన(రాజమౌళి) మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి.. పవన్‌ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.
 
భారతీయ సినీ చరిత్రలో ఆల్‌టైమ్‌ హిట్‌గా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసిన బాహుబలి-2పై ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడని సినీ స్టార్లుగానీ, రాజకీయనేతలుగానీ లేరు! ఈ క్రమంలోనే జనసేన అధినేత, నటుడు పవన్‌ కల్యాణ్‌ కూడా బాహుబలి-2పై తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు పవర్‌ స్టార్‌ ఆదివారం రాత్రి ఈ విధంగా వరుస ట్వీట్లు చేశారు.
 
 Pawan Kalyan ✔ @PawanKalyan
My Heartfelt congratulations to Shri Rajmouli,Shri Prabhas &team for their stupendous success of. Bahubali and achieving the 1000 crore mark
 
Shri Rajmouli with his years of hard work ,tenacity & dedication made alll of us proud.. I wish you many more achievements like this.
— Pawan Kalyan (@PawanKalyan) 7 May 2017
 
Thank you very much sir...