శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (19:12 IST)

పవన్ కళ్యాణ్‌ నన్ను అందుకు ఒప్పించారు : రేణుదేశాయ్

పవన్ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. పెళ్ళి జరిగి ఆ తరువాత ఇద్దరూ విడిపోవడం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు రేణు దేశాయ్ రెండవ పెళ్ళి చేసుకుని ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పవన్‌తో విడిపోయిన తరువాత ఎక్కడ కూడా ఆయనపై మాట్లాడని రేణు దేశాయ్ మొదటిసారి పెదవి విప్పింది. తన మనస్సులోని మాటలను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఈ పోస్టు ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.
 
నేను పవన్ కళ్యాణ్‌‌తో కలిసి జానీ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు బిజీబిజీగా సినిమా షూటింగ్‌లో గడిపాం. నిజానికి జానీ చిత్రంలో నేను నటించకూడదని అనుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను ఒప్పించడంతో ఆ చిత్రం కోసం 16 నుంచి 17 గంటలు పని చేయాల్సి వచ్చేది. జానీ సినిమా షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ పనులు చేసుకుని ఆ తరువాత మేకప్ గదికి వెళ్లి హీరోయిన్‌గా బయటకు వచ్చేదాన్ని అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది రేణూ దేశాయ్.