బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (08:45 IST)

నెట్టింట వైరల్ అవుతోన్న పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా సహా నలుగురు పిల్లలు కలిసి ఉన్న ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను చూసిన పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. 
 
ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లలతో నవ్వుతూ హ్యాపీగా వున్నాడు. మొదటి భార్య రేణూ దేశాయ్‌కు పుట్టిన పిల్లల పేర్లు అకీరా నందన్, ఆద్యా. ఆ తరువాత పెళ్లి చేసుకున్న లెజినోవాకి పుట్టిన పాప పొలెనా అంజనా పవనోవా, తనయుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ కొణిదెల అన్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా వరస సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. 
 
ఇప్పటికే పవన్ రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మల్టిస్టారర్ మూవీ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. క్రిష్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న హరహర మల్లు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది పట్టా లెక్కనుంది.