గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (10:25 IST)

నందమూరి బాలకృష్ణ యాభై ఏళ్ల పూర్తి.. ప్రత్యేక ఆకర్షణగా పవన్ కల్యాణ్

Pawan kalyan
నందమూరి బాలకృష్ణ కెరీర్‌కు యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంస్థలు.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, 24 క్రాఫ్ట్స్, మా, ఫిలింనగర్ సొసైటీ, ఎఫ్ఎన్‌సీసీ ఇతర సంస్థలు కలిసి వేడుకలు నిర్వహించనున్నాయి. 
 
సెప్టెంబరు 1న గచ్చిబౌలి స్టేడియంలో భారీ స్థాయిలో ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి హై-ప్రొఫైల్ అతిథులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు, పవన్ కళ్యాణ్, భట్టి మల్లు విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులను ఆహ్వానిస్తున్నారు.
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ అంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని భావిస్తున్నారు. ఈ వేడుకలో మెగా, నందమూరి హీరోలు ఒకే వేదికపై కనిపిస్తారని తెలుస్తోంది.