శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:10 IST)

శూలంతో 'హరిహరవీరమల్లు' కోసం పవన్ ప్రాక్టీస్, ఫోటోలు వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా హరిహరవీరమల్లు చిత్రం షూటింగ్ కోసం ఆయన యుద్ధ విన్యాసాలపై తర్ఫీదు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి.
 
మరోవైపు ఇటీవలే విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు లుక్ అదిరిపోయింది. ఈ చిత్రం వచ్చే 2020 సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలావుంటే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఔరంగజేబుగా అర్జున్ రాంపాల్ నటించనున్నారట. ఆయన సోదరి పాత్రలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నట్లు సమాచారం. ఔరంగజేబు సోదరికి హరిహర వీరమల్లుకు మధ్య కెమిస్ట్రీ ఏంటన్నది మరో పాయింట్.
 
ఇకపోతే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ నటించనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.