శుక్రవారం, 20 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : మంగళవారం, 10 మే 2016 (20:04 IST)

పవన్‌ ఆలోచన మారింది.. అజిత్ స్ఫూర్తితో మేకప్ లేకుండా నటిస్తారా?!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఆలోచనలు తగినట్లుగా.. ప్రవర్తిస్తుంటాడు. సినిమాలపై ఆ ప్రభావం వుంటుంది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఆశించిన హిట్‌ కాకపోవడంతో.. తను ఒరిజినల్‌గా మేకప్‌లేకుండా నటించాలని నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఆకుల శివ  అందించిన కథకు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు.. కోలీవుడ్ అజిత్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
పవన్‌ తాజా సినిమా ఫ్యాక్షనిస్టు బ్యాక్‌డ్రాప్‌. దానికి సంబధించినట్లుగా లుంగీతోపాటు.. ఒకరకమైన గడ్డెంతో కాస్తమాసినట్లుగా వుండేట్లుగా రియల్‌గా నటించడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇదికాకుండా.. అజిత్‌ చేసి.. బీరం.. వేదాలం చిత్రాలను కూడా రీమేక్‌ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.