ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల పరంపర.. ఒక్క సినిమాతో క్రేజ్... మిలియన్ ఫాలోయర్స్
ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో బోల్డ్‌గా నటించి యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించి కుర్రకారు ఆరాధ్య దేవతగా మారింది. ఈ సినిమా తర్వాత పాయల్‌కు వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ఐటమ్ గర్ల్‌గా కూడా పాయల్ చేస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘సీత’ సినిమాలో పాయల్ చేసిన ఐటెమ్ సాంగ్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది.
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్న ‘RDX’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటుగా క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న వెంకటేష్-నాగచైతన్యల ‘వెంకీ మామ’ సినిమాలోనూ ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో హల్‌చల్ చేస్తోంది.
ఇక పాయల్ ఏ ఫోటో పెట్టినా క్షణాల్లో వేల లైకులు వచ్చి పడుతున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే షీన్’ అనే వెస్టరన్ బ్రాండ్‌కు ప్రచారం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పాయల్ ఈ ఫొటోలను పోస్ట్ చేస్తోంది.