గురువారం, 2 ఫిబ్రవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 22 నవంబరు 2022 (20:13 IST)

అన్నయ్యతో తమ్ముడు - 'బాస్ పార్టీ' చూసి ఎంజాయ్...

pawan - chiru
మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు ఒక చోట కనిపించారు. చిరంజీవి హీరోగా "వాల్తేరు వీరయ్య"గా నటిస్తున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి పూర్తి పాటను బుధవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాటను పవన్ కళ్యాణ్ ముందే చూశారు.
pawan - chiru
 
తన అన్నయ్య చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాబీ, ఏఎం రత్నం తదితరులు ఉన్నారు.