బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (19:22 IST)

అల్లు స్నేహ రెడ్డి స్థాపించిన పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్

Allu Sneha Reddy
Allu Sneha Reddy
వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని జనవరి 20న ఎన్కన్వెన్షన్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ లో షాపింగ్ ఎంజాయ్మెంట్ ఆక్టివిటీస్ రుచికరమైన వంటకాలు మరియు లైవ్ మ్యూజిక్ తో ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు.

ఈ ఈవెంట్ ఈ నెల 20న ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అల్లు స్నేహ రెడ్డి పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తన తాజా సినిమా పుష్ప 2 సినిమా షూట్ లో బిజీ గా ఉన్నారు. ఇద్దరు తమ వ్యాపకాల్లో ఉంటూనే కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు.