శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (07:46 IST)

పూనమ్ పాండేకు పెళ్లికి టైం వచ్చింది...

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని హాట్ హీరోయిన్లలో పూనమ్ పాండే ఒకరు. ఈమె గతంలో పలువురితో ప్రేమాయణం కొనసాగించింది. కానీ, గత కొంతకాలంగా దర్శకుడు సామ్ బాంబేతో గాఢమైన ప్రేమలో ఉంది. అలాంటి ఈ జంట త్వరలోనే మూడు ముళ్ళ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ పెళ్లి బంధంలో భాగంగా, వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. 
 
సామ్‌బాంబే, పూన‌మ్ పాండే నిశ్చితార్థపు ఉంగ‌రాలున్న ఫొటోను సామ్‌బాంబే త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. త‌మ జీవితంలో మ‌ధుర క్షణాలు అంటూ పూన‌మ్ ఫొటోను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మ‌రి వీరి పెళ్లి ఎప్పుడు.. అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పూన‌మ్‌పాండే 'నషా' సీక్వెల్‌లో న‌టిస్తున్నారు.