శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (15:49 IST)

జబర్దస్త్ వినోద్‌కు బంపర్ ఆఫర్.. బాలీవుడ్‌లో పూనమ్ పాండేతో కలిసి? (Video)

జబర్దస్త్ వినోద్‌కు బంపర్ ఆఫర్ కొట్టింది. జబర్దస్త్ షోలో వినోద్ లేడి గెటప్‌ల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మధ్య ఈయనపై దాడి జరిగింది. అప్పుడు మరింత ఫేమస్ అయ్యాడు. ఇంటి ఓనర్ ఈయనపై దాడి చేయడం.. ఆ తర్వాత కేసులు అలా కొంతకాలం పాటు జబర్దస్త్‌కు దూరమయ్యాడు వినోద్.

దానికి ముందు కూడా కొన్ని రోజులు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారని పక్కనబెట్టారు. ఇలా ఈ మధ్య చాలా వరకు వివాదాల్లోనే ఉంటున్న వినోద్.. ఈ మధ్యే మళ్లీ షోకు వచ్చాడు.
 
తాజాగా వినోద్‌కు బాలీవుడ్ అవకాశం వచ్చిందట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. సెన్సేషనల్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే సినిమాలో వినోద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. 
 
ఓ షెడ్యూల్ కోసం వెళ్లొచ్చిన వినోద్.. తాజాగా మరో షెడ్యూల్ కోసం ముంబై వెళ్లాడు. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపాడు.

ఇటీవల తనపై దాడి జరగడంతో ఆ సినిమా షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. తన జీవితంలో చమ్మక్ చంద్రను ఓ పెద్దన్నలా భావిస్తానని.. చాలా విషయాల్లో ఆయన సహకారం అందిస్తారని చెప్పారు.