శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (17:26 IST)

డ్యాన్స్ చేయలేక తప్పుకున్న డ్యాన్సర్లు : 'మహా' పరిణామాలపై ప్రకాష్ రాజ్ ట్వీట్

మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను డ్యాన్సర్లతో పోల్చారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బేబే డ్యాన్స్ చేయలేక తప్పుకున్నారంటూ ట్వీట్ చేశారు. 
 
బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎపిసోడ్ కనిపిస్తుందేమో... అంటూ ట్వీట్ చేశారు. ఓ అధినేత, మరో చాణక్యుడు, వారి పెంపుడు చిలుకలతో కూడిన అర్థరాత్రి అంతరాత్మల మూకుమ్మడి రాజకీయం ఎలా ఉంటుందో రేపు అందరూ చూడాల్సిందేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ, 'సిగ్గు సిగ్గు... డ్యాన్స్ చేయలేని డ్యాన్సర్లు ఎట్టకేలకు వైదొలిగారు' అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి తలవంపులు తెస్తున్నారంటూ మండిపడ్డారు.