ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జులై 2020 (18:03 IST)

హార్దిక్ పాండ్యా.. నటాషా ఫోటోలు వైరల్.. సానియా మీర్జా లవ్ ఎమోజీ

Hardik pandya
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పెళ్ళికి ముందే తండ్రికి కాబోతున్నాడు. తన ప్రియురాలు నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషాతో సహజీవనం చేస్తూ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయాన్ని కూడా ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన భాగస్వామి నటాషాతో హార్దిక్ పాండ్యా గడుపుతున్న ప్రతిక్షణాన్ని ఫోటోల రూపంలో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే వున్నాడు. 
 
తాజాగా హార్దిక్ పాండ్యా నటాషా వెనకనుండి కౌగిలించుకొని ఇద్దరూ కలిసి తమ చేతుల మీద ఉంచిన, అపురూపంగా పెట్టిన చిత్రం ద్వారా హార్దిక్ పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టుకు హార్దిక్ పాండ్య హార్ట్ విత్ రిబ్బన్ పెట్టి పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం అభిమానులే కాకుండా సహచర ఆటగాళ్లు కూడా ఈ ఫోటోపై స్పందించారు. 
Hardik pandya
 
తన సోదరుడు కృనాల్ పాండ్యా, టీమిండియా ఆటగాడు కె.ఎల్.రాహుల్ కూడా ఈ ఫోటోపై స్పందించారు. భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా కూడా ఈ ఫోటోకు లవ్ ఎమోజీ లను కామెంట్ చేసింది. కాగా త్వరలోనే హార్దిక్ తండ్రి అవుతాడని.. నటాషా లేబర్ వార్డుకు వెళ్లే రోజులు సమీపిస్తున్నానని సన్నిహితులు చెప్తున్నారు.