శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (15:38 IST)

హార్దిక్ పాండ్యా ఒడిలో నటాషా.. పెంపుడు శునకానికి ముద్దుపెడుతూ..?

Hardik_Natasha
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 2016, జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకూ 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌లాడాడు. ఈ క్రమంలో ఇప్పటికే 1,799 పరుగులు, 109 వికెట్లు పడగొట్టిన ఈ ఆల్‌రౌండర్.. స్లాగ్ ఓవర్లలో స్కోరు బోర్డుని అమాంతం పెంచడంలో సిద్ధహస్తుడు. 
 
అయితే ఈ మధ్య క్రికెట్ పరంగానే కాకుండా వ్యక్తిగతమైన అంశాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా.. సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. జనవరి 1న వీరి నిశ్చితార్థం జరిగింది. 
 
అయితే మే 31న తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. పెళ్లి కాకుండానే తండ్రి కావడం ఏంటనే విషయంలో చర్చ జరిగింది. కానీ.. అవన్నీ ఏమీ పట్టించుకోని హార్దిక్.. తాజాగా తన డ్రీమ్ ఫ్యామిలీ ఫొటోని సోషల్ మీడియాలో వదిలాడు. 
 
గర్భంతో ఉన్న నటాషా స్టాంకోవిచ్‌.. హార్దిక్ పాండ్యా ఒడిలో పడుకుని ప్రేమగా అతనివైపు చూస్తుండగా.. హార్దిక్ మాత్రం పక్కనే ఉన్న తన పెంపుడు శునకాన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఈ ఫొటోని షేర్ చేస్తూ లవ్లీ డ్రీమ్ ఫ్యామిలీ అని అర్థం వచ్చేలా హార్దిక్ క్యాప్షన్ ఉంచాడు. సాధారణంగా హార్దిక్‌కు నటాషాకు పెంపుడు శునకాలంటే మహాఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.