హార్దిక్ పాండ్యా పోస్టు.. నటాషా అంత అందం ఎక్కడి నుంచి వచ్చింది..?

Hardik pandya
సెల్వి| Last Updated: శనివారం, 27 జూన్ 2020 (18:00 IST)
Hardik pandya
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనకు కాబోయే భార్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్‌తో దిగిన ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటాషా.. తన క్రికెటర్ ప్రియుడితో దిగిన ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అసలు విషయానికి వస్తే హార్దిక్ పోస్టు చేసిన పోస్టులో ''నీ ముఖం మీద 'అంత అందం ఎక్కడి నుండి వస్తుంది'' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా నటాషా 'నీ పాంపరింగ్, మనకు త్వరలో పుట్టబోయే బిడ్డ కారణంగా నాకు ఇంత అందం వచ్చింది' అని తెలిపింది.

కాగా జూన్ నెల ఆరంభంలో హార్దిక్ పాండ్యా తాను తండ్రి కాబోతున్న విషయాన్ని ప్రకటించాడు. ఈ ఏడాది జనవరి 1 న సోషల్ మీడియాలో హార్దిక్ పోస్ట్ ద్వారా వారి ప్రేమాయణం బయటకు వచ్చింది. ఇకపోతే.. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనను దూరమైన హార్దిక్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 13 వ సీజన్లో తిరిగి మైదానంలోకి రావాలని అనుకున్నాడు. అయితే, కొనసాగుతున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ముంబై ఇండియన్స్ యొక్క ఆల్ రౌండర్ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.దీనిపై మరింత చదవండి :