మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (22:23 IST)

నువ్వు నా హృద‌యానివి.. హార్దిక్‌ను చిల్ చేసిన నటాషా

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజన్ వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన హార్దిక్‌.. తన ప్రియురాలు నటాషాతో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంకా కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో హార్దిక్ తన ప్రియురాలి జ్ఞాపకాలతో గడుపుతున్నాడు.  
 
ఈ ఏడాది జనవరి ఒకటిన సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాంకోవిచ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిందనే విషయాన్ని హార్దిక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణను హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 
 
ఈ వీడియోలో హార్దిక్ ''బేబీ, మై క్యా హూ తేరా'' అని అడిగితే.. దానికి నటాషా కాస్త నవ్వుతూ.. ''జిగర్ క తుక్‌డా'' అని బదులిస్తుంది. నేను నీకు ఎంత ప్ర‌త్యేకం అని హార్దిక్ అడిగితే.. నువ్వు నా హృద‌యానివి అని నటాషా బదులిచ్చింది.