సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (18:18 IST)

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ : టీమిండియా ఎంపిక.. సభ్యులు ఎవరంటే...

ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సౌతాఫ్రికాతో భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ఇప్పటికే ప్రకటించగా, ఆదివారం భారత జట్టును ఎంపిక చేశారు. ఇందులో గాయంతో బాధపడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మను జట్టులోకి ఎంపిక చేయలేదు. 
 
అయితే, డీవై పాటిలో ట్రోఫీలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో మోతమోగించిన హార్దిక్ పాండ్యకు జట్టులో చోటుకల్పించారు. జట్టు ఓపెనర్లుగా శిఖర్ ధవాన్, పృథ్వీ షాలను ఎంపిక చేశారు. కానీ, పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా, వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్‌కు మొండిచేయి చూపించారు. 
 
భారత జట్టు సభ్యులు వీరే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్ మాన్ గిల్.