శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (16:54 IST)

రాహుల్ బాబూ.. నీకు బౌలింగ్ తెలుసా? (video)

భారత జట్టులో శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అప్పుడప్పుడు గాయాల పాలవుతున్నారు. దీంతో కేఎల్ రాహుల్ పరిస్థితి దారుణంగా మారింది. భారత జట్టుకు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాహుల్‌లు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు వున్నారు. ఇందులో ఈ ముగ్గురు ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. 
 
అందుచేత కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్‌ల్లో మూడో స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా, ఐదో బ్యాట్స్‌మెన్‌గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగాడు. అయితే ఏ స్థానంలో దించినా కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతంగా రాణించి.. తన సత్తా చాటాడు. 
 
తొలిమ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్‌కు గాయం ఏర్పడింది. ఫలితంగా రాహుల్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాల్సి వచ్చింది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు కోసం రాహుల్‌ను బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్‌గా బరిలోకి దించుతున్నారు. 
 
ఇక మిగిలింది.. బౌలింగే బాబూ.. నీకు బౌలింగ్ తెలుసా? అని కోహ్లీని రాహుల్‌ను అడుగుతున్నట్లు గల వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి సెటైర్లు విసురుతున్నారు. కోహ్లీ బౌలింగ్ తెలుసా అని అడిగితే.. రాహుల్ కూడా అయితే టిక్కెట్ వేయండి అంటూ చెప్పే మీమ్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఇందులో ఓ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.