సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (16:14 IST)

బ్రో... నీ కెరీర్ పీక్ స్టే‌జ్‌లో ఉంది.. 12వ స్థానంలో వచ్చినా సెంచరీ బాదేస్తావ్...

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ట్వంటీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయగా, ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను కివీస్ జట్టు వైట్ వాష్ చేసింది. ఒక దేశంలో భారత జట్టు ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ ఓడిపోవడం గత 31 యేళ్ళలో ఇదే మొదటిసారి. 
 
అయితే, కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. దీంతో కేఎల్ రాహల్‌ ఆటతీరుపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆఖరి వన్డేలో భారత్‌ ఓడినా రాహుల్‌ ఇన్నింగ్స్‌ మాత్రం అందరిని ఆకట్టుకుంది. 
 
ఈ నేపథ్యంలోనే ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్‌ ప్రదర్శనను కొనియాడాడు. 'కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించావ్ బ్రో. నీ కెరీర్‌ ఇప్పుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇలానే నీ విధ్వంసాన్ని కొనసాగిస్తే 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ సాధిస్తావ్' అనే క్యాప్షన్‌తో రాహుల్ సెంచరీ ఫొటోను షేర్ చేశాడు. ధావన్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.