సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:36 IST)

#INDvsNZ 3rd ODI రాహుల్ రికార్డు.. సెంచరీతో అదరగొట్టేశాడు..

న్యూజిలాండ్‌-టీమిండియాల మధ్య మూడో వన్డే మౌంట్ మాంగనూయ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మూడో వన్డేలో భాగంగా టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆదిలోనే కాస్త తడబడింది. 2 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (1), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (9) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరారు. కైల్ జెమీసన్‌ బౌలింగ్‌లో మయాంక్‌ బోల్డ్ కాగా.. బెనెట్‌ బౌలింగ్‌లో జేమీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి విరాట్‌ వెనుదిరిగాడు. దీంతో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. 
 
భారత్‌ మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓపికగా క్రీజులో పాతుకుపోయిన అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కేఎల్‌ రాహుల్‌ సాయంతో అయ్యర్‌ స్కోరు బోర్డును పరుగు పెట్టించాడు. ఈ క్రమంలోనే వన్డే కెరీర్‌లో ఎనిమిదవ అర్థ సెంచరీని నమోదు చేసుకున్నాడు. కానీ అయ్యర్ ధాటిగా ఆడటంతో అవుటై పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లోనే రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి మనీష్ పాండే చక్కటి సహకారం అందించాడు. 
 
జట్టుకు అండగా నిలుస్తూ నిలకడగా ఆడిన రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఈ క్రమంలో సెంచరీతో అదరగొట్టాడు. 104 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో రాహుల్ ఓ రికార్డును నమోదు చేశాడు. 
 
కివీస్ గడ్డపై ఐదవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. 2015లో న్యూజిలాండ్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు సురేష్ రైనా (110) సెంచరీ చేసి తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.