శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (10:29 IST)

#షమీకి విశ్రాంతి.. కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్

టీమిండియా, న్యూజిలాండ్‌ల మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో రెండో వన్డేలో భారత్‌ తలపడుతోంది. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. 
 
ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. త్వరలో కీలకమైన టెస్టు సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు విరాట్‌ చెప్పాడు. షమీ స్థానంలో యువ పేసర్‌ నవదీప్‌ సైనీని ఎంపిక చేయగా.. చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో స్పిన్నర్‌ చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.   
 
భారత జట్టు 
పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌రాహుల్‌(వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనీ, చాహల్‌, బుమ్రా
 
కివీస్ జట్టు 
మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ బ్లండెల్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, మార్క్‌ చాపమన్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌హోం, టిమ్‌ సౌథీ, జెమీసన్‌, బెనెట్‌